ఉల్లి ధరలు సామాన్యుడికి గుండె పోటు తెప్పిస్తున్నాయి.. గత ఐదు నెలల నుంచి కరోనా పుణ్యమా అంటూ చిన్న గుండు పిన్ను నుంచి పెద్ద వస్తువుల వరకు అన్నిటిపైన ధరలు పెరిగాయి..ముఖ్యంగా వండుకుకొని తినడానికి కూడా వీలు లేకుండా నిత్యావసర సరుకులను కూడా పెంచేశారు.  సరైన రవాణా లేకపోవడంతో పాటుగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి.. చికెన్ కు కూడా ఎక్కువ డిమాండ్ ఉండటంతో రేట్లు పెరిగాయి.. నిన్న కాక మొన్న  గుడ్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు మాములుగా లేవని తెలుస్తుంది.. గతంలో వందకు 8 కిలోలు ఇచ్చిన వ్యాపారులు ఇప్పుడు 80 నుంచి 90 రూపాయలు చెప్తున్నారు.రైతు బజార్లలో కిలో రూ.24గా ఉండే ఉల్లి ధర రూ. 84కు చేరింది. దీంతో జనం మండుతున్న ఉల్లిగడ్డ ధరలు చూసి కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు భారీ వర్షాలు, వరదలు కారణమని చెప్తున్నారు..  చేతికి వచ్చిన పంట నీట మునగడం తో ఈ ధరలు పెరిగాయని అంటున్నారు.


ఇకపోతే ఉల్లి చేలలో నుంచి నీరు బయటకు పంపే అవకాశాల్లేకపోవడంతో పంట దెబ్బతింది. కూలీల ఖర్చు వృథా అన్న ఉద్దేశంతో అధిక శాతం రైతులు ఆ పంటను తవ్వకుండానే దున్నేశారు. మళ్లీ కొత్తగా ఉల్లిని సాగుచేయలంటే 50 వేలకు పైగా ఖర్చులు అవుతున్నాయి. దీంతో పొలాల్లో ఉల్లి సాగుకు రైతులు ఇంట్రెస్ట్ చూపించలేదు.హైదరాబాద్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని షోలాపూర్‌, ఔరంగాబాద్‌, నాసిక్‌, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్‌, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్ తదితర ప్రాంతాల నుంచి ఉల్లి వస్తున్నాయి.. అయితే ఇప్పుడు అక్కడ కూడా భారీ వర్షాలు కురవడంతో ఉల్లి పంట పాడైంది. ఇప్పటిలో ఉల్లి ధరలు తగ్గేలా లేవని తెలుస్తుంది.. ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: