కరోనా  వైరస్ ప్రభావం విద్యారంగం పై ఎక్కువగా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. ఎప్పుడో  ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కరోనా  వైరస్ కారణంగా ఇప్పటికీ కూడా పూర్తిస్థాయి లో ప్రారంభం కాలేదన్న  విషయం తెలిసిందే. ఇప్పుడే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యం లో విద్యా సంస్థలను పున ప్రారంభించేందుకు సిద్ధ మవుతున్నాయి. ఇక అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థల ప్రారంభాని కి తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రం లోని అన్ని రకాల జూనియర్ కాలేజీ ల ప్రవేశాల కోసం దరఖాస్తులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ దరఖాస్తుల విషయం లో క్రమక్రమంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది తెలంగాణ విద్యా శాఖ. కరోనా  వైరస్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇప్పటికి కూడా వివిధ కారణాలతో దరఖాస్తులు చేసుకోలేక పోతున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూనియర్ కాలేజీల ప్రవేశాల పై ఆలోచించిన తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుని విద్యార్థులందరి కీ శుభవార్త తెలిపింది.



 తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జూనియర్ కాలేజీల్లో  ఇంటర్ ప్రవేశాల కోసం గడువును పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇంటర్ బోర్డు విధించిన గడువు ప్రకారం ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిన్నటితో గడువు ముగియనుంది. కానీ ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు వివిధ కారణాలతో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోని  నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులందరికీ ఇది  గొప్ప శుభవార్త అనే చెప్పాలి.ఇక ఇప్పటి వివిధ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోని  విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: