వాచ్ ప్రాణాలు కాపాడడం ఏంటి అనే టైటిల్ చూడగానే మీకు అనుమానం రావొచ్చు కానీ నిజంగానే ఇక్కడ చేతికి పెట్టుకునే  ఒక స్మార్ట్ వాచ్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. సరైన సమయానికి వాచ్ పెట్టుకున్న వ్యక్తికి ఆరోగ్య సమస్యలు గురించి హెచ్చరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు వ్యక్తి. ఎన్నో అధునాతన టెక్నాలజీతో కూడిన వాచ్ లు  మార్కెట్లోకి వస్తున్న విషయం తెలిసిందే. చేతికి పెట్టుకునే వాచ్ ల  ద్వారా ఒక మనిషి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మనిషి శరీరంలోని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా వాచ్ ద్వారా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.



 ఇక మనిషి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గడం ఏదైనా మార్పులు వచ్చినప్పుడు వాచ్ లో  ఉన్న టెక్నాలజీ వెంటనే గుర్తించి సమాచారం అందిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇలాంటివి బాగా ఎక్కువగా సినిమాలలో కనిపిస్తూ ఉంటాయి కానీ నిజజీవితంలో కూడా అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలామంది ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది.



 యాపిల్ వాచ్ ఏకంగా 61 ఏళ్ల రాజహంస అనే వ్యక్తి ప్రాణాలు కాపాడింది. రాజ హంస అనే వ్యక్తికి కొడుకు యాపిల్ వాచ్ ఇటీవలే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ వాచ్ లో  ఈసీజీ టెక్నాలజీ ఉంది. ఇక ఈ టెక్నాలజీ ఎప్పటికప్పుడు గుండె పనితీరును తెలియజేస్తూ ఉంటుంది. ఇటీవలే ఈ వాచ్ లో ఉన్న ఈసీజీ ఫంక్షన్ గుండె పనితీరుకు సంబంధించి  రాజహంసను  హెచ్చరించింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించిన సదరు వ్యక్తి పరీక్షించుకోగా  గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు దీంతో సర్జరీ చేసుకొని ప్రాణాపాయం నుంచి సదరు వ్యక్తి బయటపడ్డాడు. ఈ క్రమంలోనే తాను బహుమతిగా ఇచ్చిన ఆపిల్ వాచ్ తన తండ్రి ప్రాణం కాపాడింది అని కొడుకు ఆనందం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: