భారత దేశం మహిళల పై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి చాలా కష్టపడుతుంది.. కామాంధుల చెర నుంచి కాపాడటానికి  పోలీసులు, ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తుంది.. ఈ మేరకు కొత్త చట్టాలను కూడా అమలు చేస్తుంది. ఎక్కడ అన్యాయాలు జరగకుండా చూసుకుంటాము అని ప్రభుత్వం భరోసా ఇస్తున్నారు కూడా ప్రజలు భయపడుతున్నారు. అమ్మాయిలను బయటకు పంపించడం లేదు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల తో పాటుగా, నార్త్ ఇండియాలో అమ్మాయిల పై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న యూపి లో జరిగిన ఘటన దేశాన్ని కదిలించి వేసింది.


ముఖ్యంగా మహిళా సంఘాలను కోపానికి గురిచేసింది. హాత్రాస్ లో జరిగిన దళిత యువతి అత్యాచారం పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు నిర్వహించారు.. మరోవైపు మానవహారాలు చేపట్టారు. ఇది ఇలా ఉండగా ఈ కేసును సీబీఐ కి అప్పగించారు.. ప్రస్తుతం వాళ్ళు ఈ కేసును అన్నీ కోణాల్లో పరిశీలిస్తున్నారు. మహిళల కోసం యూపీ ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. అమ్మాయిలు తమ దగ్గర కత్తులను ఉంచుకోవాలని, అవసరమైనపుడు వాటిని ఉపయోగించాలని ఆ మంత్రి పిలుపు నిచ్చారు. అందరి ముందు మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం కాస్త దుమారం రేపుతుంది.


లలిత పూర్ లో జరిగిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి మనోహార్ లాల్.. మహిళలంతా కత్తులు పట్టాలని సలహా ఇచ్చారు. అంతేకాదు, అవసరమైన సందర్భాల్లో మహిళలు కత్తులతో దాడులకు దిగాలని సూచించారు.మహిళలు ఆందోళన చెందవద్దని, రాష్ట్రమంతా వారికి అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ వ్యాఖ్యల పై కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ తీవ్రంగా ఖండించారు. ఓ మంత్రి అయ్యి ఉండి ఇలా మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక చర్చలకు దారి తీసింది. మరి ఈ విషయం ఎక్కడికి వెళుతుంది చూడాలి..





మరింత సమాచారం తెలుసుకోండి: