తెలంగాణ పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ మొత్తం జలమయం అయిన సంగతి తెలిసిందే.. గత వందేళ్ల లో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా వర్షాలు కురవడంతో అందమైన భాగ్యనగరం ఇప్పుడు దయనీయంగా మారింది. ఎంతో అభివృద్ది చెందిన ఈ నగరం ఇప్పుడు ఇలా మారడం ఎవరు ఊహించుకొలేక పోతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జల దిగ్బంధం లో ఉన్నారు. 1500 కాలనీలు ఇప్పటికీ నీళ్ళల్లో ఉంది. నగరంలో ఎక్కడిక్కడ నాళాలు మూసుకుపోవడం తో నీళ్ళు పైకి పొంగుతున్నాయి.

అయితే నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అంధకారంలో ఉంది. రోడ్ల పై చెట్లు విరిగి పడిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఆ దారుణ ఘటనా నుంచి బయట పడక ముందే ఇప్పుడు మరో ఉపదృవం వచ్చిపడింది. అల్పపీడనం కొనసాగుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు , నాలుగు రోజులు పాటు వర్షాలు తగ్గవని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇంకా వర్షాలు పడే అవకాశం ఉండటంతో తెరాస సర్కార్ పలు రాష్ట్రాల ప్రభుత్వాలను సాయం కోరుతుంది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆంధ్ర ప్రదేశ్ ను కేసీఆర్ బోట్లు కావాలని కోరాడు. ఈ విషయం పై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఆంధ్రలోని పర్యాటక ప్రాంతాల్లోని 40 బోట్లను తెలంగాణాకు పంపించారు. మనం ఎలా ఉన్నా సాయం కోరిన వాడికి లేదనకూడదు అనే జగన్ ఆలోచన పై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అభినందిస్తున్నారు.. తెలంగాణకు పెద్ద సాయం చేసిన జగన్ ప్రభుత్వం పై తెలంగాణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రాలోని సహాయక బృందాలను కూడా తెలంగాణకు పంపించే ఆలోచన లో జగన్ ఉన్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: