తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. త్వరలో తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎలాగైనా సరే చక్రం తిప్పే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కూడా అవకాశాలు లేకపోయినా, అక్కడ అవకాశాలను సృష్టించుకొనే విధంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అని భావిస్తున్నారు. తమిళనాడు పర్యటనకు వెళ్లి ఆయన ఆ రాష్ట్రానికి కొన్ని వరాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బీహార్ ఎన్నికల మీద బీజేపీ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బీహార్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన తమిళనాడు పర్యటనకు నరేంద్ర మోడీ   వెళ్లవచ్చు అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. తమిళనాడులో డిఎంకె అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం ఉంటుంది.

కాబట్టి డీఎంకేని అధికారంలోకి తీసుకురాకూడదు అని భావిస్తోంది. తమతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే ఎలాగైనా సరే విజయం సాధించే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయసహకారాలు అందించవచ్చు అని భావిస్తున్నారు. అయితే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మీద చాలా వరకు కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా జయలలిత విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన వైఖరిపై ప్రజల్లో అసహనం ఉన్న సంగతి తెలిసిందే. దీనితో అక్కడ వ్యతిరేకతను కాస్త తగ్గించుకునే విధంగా భారతీయ జనతా పార్టీ పెద్దల వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్కడి పర్యటనకు వెళ్లే అక్కడి ప్రజలతో మమేకమై ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: