అమరావతి: టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేరు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణను రీసెంట్ గా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు. 24 మంది సభ్యులతో కూడుకున్న పొలిట్ బ్యూరోను ఏర్పాటుచేశారు. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ప్రకటించారు. అయితే టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత అచ్చెన్నాయుడు మొట్టమొదటిసారిగా చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇన్ని రోజులు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని అందుకే గ్యాప్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానని తెలిపారు. బలహీన వర్గాలను చైతన్యపరిచి ఏకం చేస్తానని.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానని పేర్కొన్నారు. తనకు దక్కినటువంటి హోదా బలహీన వర్గాలకు దక్కిన గౌరవం అని.. టీడీపీ బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు.

టీడీపీకి పూర్వవైభవం తెచ్చి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో బీసీలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలన్న దృష్టితో రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నాయకుడికి ఇచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే టీడీపీకి అచ్చెన్నాయుడు ఎంతో కీలకమైన నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబం టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చింది. ఇదే కుటుంబం నుంచి సిక్కోలు ముద్దుబిడ్డగా ఎర్రన్నాయుడు పార్టీ తన భుజస్కందాల మీద వేసుకుని టీడీపీకి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన మరణం తర్వాత ఆ బాధ్యతలను సోదరుడు అచ్చెన్నాయుడు తీసుకున్నారు.

మరికొన్ని కీలక పదవుల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్ ను, జాతీయ కార్యవర్గానికి, కార్యదర్శ వర్గానికి రామ్మోహన్ నాయుడును, టీడీపీ కేంద్ర కమిటీలు 25 మందిని, టీడీపీ రాష్ట్ర కమిటీలో 31 మందిని పలు పదవుల్లో నియమించారు. అయితే ఈ సారి పలు కీలక పదవుల్లో ఇతర ఆంధ్రా నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని చెప్పాలి. అయితే చాలా చోట్ల మాత్రం ప్రకటించిన 24 గంటల్లోనే అసంతృప్తి మంట రగులుతోంది. తాను హ్యాపీగా టీడీపీ అధ్యక్షుడిని అయిపోయానని అనుకునేటువంటి సమయంలోనే అచ్చెన్నాయుడుకు భారీ షాక్ లు తగులుతున్నాయి. సొంత పార్టీ నుంచే చాలా మంది ఈ విషయాన్ని అసంతృప్తిగా తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: