గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సరే సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడంలేదని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రగతి భవన్ నుంచి బయటకు రావడం లేదని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజల్లోకి వచ్చి కష్టాలు చూస్తే వారు పడుతున్న బాధలు తెలుస్తాయని అంతేగాని ప్రగతిభవన్ లో ఉంటే ఏం తెలుస్తుంది అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడానికి ఒక కీలక అడుగు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన త్వరలోనే ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత రైతులు నేరుగా కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఆయన రైతులకు చేయాల్సిన ఆర్థిక సహాయంపై నేరుగా వారితోనే మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. స్వయంగా ఆయన పరిశీలిస్తే వరద నష్టానికి సంబంధించి ఒక అంచనా కూడా వస్తుంది.

దీనితో త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రధానంగా ఖమ్మం నల్గొండ జిల్లాల్లో పర్యటించి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి ఆయన వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తో కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ మాట్లాడారని త్వరలోనే వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన రైతులలోకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా వాస్తవ పరిస్థితులను వివరించాలంటే సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: