ఆంధ్రప్రదేశ్ లో రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా వర్షాల దెబ్బకు అన్ని వ్యవసాయ పంటలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి మనం చూశాం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునే విధంగా అడుగులు వేస్తుంది. రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు రాకూడదు అని సీఎం జగన్ కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా వరదలు దెబ్బకు వ్యవసాయం నాశనం అయిపోయింది. పంట చేతికి వచ్చిన సమయానికి వరదలు రావడంతో ఇప్పుడు రైతులు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ రైతుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా సరే రైతుల కోసం ఏదో ఒక విధంగా సహాయం చేయాలని  సీఎం జగన్   భావిస్తున్నారు. త్వరలోనే సీఎం జగన్ రైతులు నష్టాల సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా రైతులకు ఎంత వరకు నష్టం జరిగింది ఏంటి అనే అంశాలను తన వద్దకు నివేదిక తెప్పించుకుని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తో కూడా సీఎం జగన్ చర్చించినట్లుగా తెలుస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ కమిటీకి వ్యవసాయ శాఖ మంత్రిని చైర్మన్ గా చేయాలని అదేవిధంగా ఇందులో రైతు నాయకులు కూడా కలపాలి అని సీఎం జగన్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అడుగు పడే అవకాశాలు ఉండవచ్చు. సీఎం జగన్ కూడా వరద బాధిత ప్రాంతాల్లో నేరుగా పర్యటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: