తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు గురించి అదేవిధంగా వరదలు గురించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

ఒకపక్కన కరోన వైరస్ తో ఇబ్బంది పడుతున్నా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కాస్త కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. కేంద్రం కొన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది అనే అంశాన్ని సీఎం కేసీఆర్ ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

స్వయంగా సీఎం కేసీఆర్ అమరావతి వచ్చే సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే కేంద్రం పై పోరాటం చేసే విషయంలో ఇప్పుడు సీఎం జగన్ ని కూడా కలుపుకుని వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జగన్ ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నా లేకపోయినా సరే జగన్ సహకారం మాత్రం తీసుకునే విధంగా కెసిఆర్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే పశ్చిమబెంగాల్ కూడా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: