ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా కూడా లోటు చేయడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా సరే సీఎం జగన్ మాత్రం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా సీఎం జగన్ అమలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని హామీలను కూడా అమలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ హామీల అమలు విషయంలో అధికారుల పాత్రపై సిఎం జగన్ అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో కొంత మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న సరే అధికారుల పట్టించుకోకపోవడంతో వారి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పెన్షన్లను దరఖాస్తు చేసుకున్న సరే చాలా వరకు కూడా రావడం లేదు.

దీనితో సీఎం జగన్ కూడా సీరియస్ గానే ఉన్నారు. పెన్షన్ లపై త్వరలోనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించి అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు ఇచ్చిన అప్లికేషన్లను కూడా పూర్తి చేయలేని స్థితిలో కొంతమంది అధికారులు ఉన్నారు. దీనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు సీఎం జగన్ వద్దకు వచ్చాయి. దీనితో ఆయన త్వరలోనే సంబంధిత శాఖతో కూడా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే ఆయన నుంచి ఒక కీలక ప్రకటన కూడా రావచ్చు అని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: