ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎన్ని విధాలుగా  విపక్షాలు ఇబ్బంది పెట్టాలని భావించినా సరే  సీఎం జగన్  మాత్రం సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో చాలా వరకు కూడా దూకుడుగా వెళ్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ఆయన ప్రజల కోసం ప్రకటించే  విధంగా ముందుకు వెళ్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో దూకుడుగా వెళ్తున్నారు.

తాజాగా వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా ప్రభుత్వం  ఉంటుందని అన్నారు. బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పారు. కుటుంబ పెద్దకు జీవన భద్రత, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది అని ఆయన స్పష్టం చేసారు. రూ.510 కోట్ల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది అని ఆయన స్పష్టం చేసారు. 18-50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు బీమా అందిస్తామని చెప్పారు.

సహజ మరణానికి రూ.2 లక్షల బీమా అందిస్తామని అన్నారు. 50-70 ఏళ్ల మధ్య ఉన్న వారు మరణిస్తే రూ.3 లక్షలు బీమా  చెల్లిస్తామని చెప్పారు. వైఎస్సార్ బీమాతో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.  ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా  అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదల కొసం వైఎస్సార్ బీమా పథకం తెచ్చాం అని జగన్ అన్నారు. కేంద్రం తప్పుకున్నప్పటికీ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని స్పష్టం చేసారు. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్ జాబితా పెడతాం అని ఆయన అన్నారు. పేర్లు లేని వారు గ్రామ సచివాలయానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవచ్చు అని సిఎం జగన్ స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: