వైజాగ్: ఇటీవల మాజీ ఎంపీ సబ్బంహరి ఆఫీసును జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంతో ఆయన మరో్మారు వార్తల్లో నిలిచారు. జగన్ ప్రభుత్వం కావాలని తనపై పగ తీర్చుకుంటుందని, వైసీపీ నేతల ఆటకట్టిస్తానంటూ ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటిరోజే మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే. నిజానికి ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటికి.. మొదటి నుంచి ఆయన వైఎస్ కుటుంబానికి విధేయుడు. ఎందుకంటే.. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సబ్బంహరి మాత్రమే. అనంతరం వేరే నాయకులు వచ్చినా అది వేరే విషయం. జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంది సబ్బం హరినే. వైఎస్సార్ వల్లే తాను అనకాపల్లి నుంచి గెలిచానని చాలా సందర్భాల్లో సబ్బంహరి చెప్పారు. ఆ అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీని కాదని జగన్ వెంట ఆయన నడిచారు. జగన్ సోదరి షర్మిలతో కలిసి పార్టీలో పనిచేస్తూ కీలకనేతగా మారారు. అయితే సబ్బంహరిని అకస్మాత్తుగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి జగన్ సంచలనం సృష్టించారు. ఇలా పార్టీలో కీలకంగా ఉన్న సబ్బంహరిని ఎందుకు సస్పెండ్ చేశారన్న ప్రశ్నలు చాలా మందిలో మెదిలాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న సబ్బంహరిని తన పదవికి రాజీనామా చేయమన్నా చేయకపోవడాన్ని జగన్ సహించలేకపోయారు.

పైగా పార్టీ ఫండ్ లో కూడా అవకతవకలకు పాల్పడ్డారని తెలియడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామాల తరువాత నుంచి సబ్బంహరి జగన్ ను తీవ్ర పదజాలంతో తిట్టడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం కావడంతో ఇక వైసీపీ ప్రత్యర్థి అయిన టీడీపీలో చేరి జగన్ పై కక్ష సాధించడం మొదలుపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో గత కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయారు ఈ మాజీ ఎంపీ. అయితే వైజాగ్ లో సబ్బంహరి అక్రమంగా నిర్మించిన ఆఫీస్ ను ఇటీవల జీవీఎంసీ అధికారులు పడగొట్టారు. దీంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఆఫీస్ ను చెప్పాపెట్టకుండా పడేయటాన్ని తప్పుపట్టారు. తన గురించి అందరికంటే ఎక్కువగా జగన్ కే తెలుసన్నారు. 24 గంటల్లో దీనికి కారణమైన వారి అంతు చూస్తానని మీడియా సాక్షిగా రెచ్చిపోయారు. అయితే ఒకరోజు తరువాత మీడియా ముందుకు వచ్చి తాను అలా మాట్లాడాల్సి ఉండకూడదని క్షమాపణలు తెలిపారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సబ్బంహరి వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. టీడీపీలో తీవ్ర అసంతృప్తిగా ఆయన ఉన్నారట. పైగా ఆఫీసు కూల్చివేసిన సమయంలో పార్టీ తరపున ఎవరూ మాట్లాడలేదని ఆయన వాపోయారట. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో ఉండటం కంటే వైసీపీలో చేరి పరువు నిలబెట్టుకోవడం మంచిదని ఆయన అనుకుంటున్నారట. అయితే ఆయన వైసీపీలో చేరేది వైజాగ్ మేయర్ పదవి కోసమేనని వైసీపీ నాయకులు చెబుతున్నారు. పదవుల కోసం పార్టీలు మారే వారికి వైసీపీలో అవకాశం ఉండదని వారు అంటున్నారు. పైగా జగన్ ను తీవ్ర పదజాలంతో దూషించిన సబ్బంహరిని పార్టీలోకి తీసుకోకూడదని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. మరి సబ్బంహరి పార్టీలో చేరికపై వైసీపీ

మరింత సమాచారం తెలుసుకోండి: