కరోనా సమయంలో ప్రజల కష్టాలను ఏ మాత్రం అర్ధం చేసుకోకుండా కొందరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా సరే చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజలను అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరబాద్ లో  ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. రాచకొండ కాప్రా గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో నిలువు దోపిడీ చేస్తున్నారు. షార్టేజ్ పేరుతో ఉద్యోగుల జీతాలు కాజేస్తున్నారు పై స్థాయి ఎగ్జిక్యూటివ్ సిబ్బంది.

చాలి చాలని జీతాలు అందులో కోత విధించడంతో పోలీసులను ఆశ్రయించారు అపోలో  ఫార్మసీ ఉద్యోగులు. షార్టేజ్ పేరుతో ప్రతి నెలా 5000 రూపాయల నుండి 8000 వేల రూపాయల వరకు కాజేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసారు. గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో పనిచేసే ట్రైనీ ఉద్యోగిని జెస్సీ (బేబీ) ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలి అని కోరారు. ఫార్మసీ లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ సిబ్బంది వద్ద ఇలాగే నెల జీతం కాజేసురున్నారని ఫిర్యాదు చేసారు. జీతంలో నుండి మొత్తం డబ్బులు తీసుకుంటే మేము ఎలా బ్రతకాలి అని ఆవేదన వ్యక్తం చేసారు.

మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేసారు అక్కడ పని చేసే కొందరు ఉద్యోగులు. ఇదేంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు కూడా దిగారు అని అధికారులకు తమ ఆవేదన వ్యక్తం చేసారు. పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు మాఫియా గా ఏర్పడి ఉద్యోగులను వేదిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని పోలీసులను ఫార్మసీ ఉద్యోగులు కోరారు. ఫార్మసీ ఉద్యోగుల ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: