వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తక్షణ సహాయం మేరకు రూపాయలు 10 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు .ఇళ్లు పూర్తిగా పాడైన వారికి అదనపు పరిహారం అందిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.

 మంగళవారం ప్రగతిభవన్లో జీహెచ్ఎంసి మేయర్ ,డిప్యూటీ మేయర్ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో పది రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని వారితో చెప్పారు .

గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు తమ రెండు నెలల వేతనం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తామని ప్రకటించారు .ఈ నిర్ణయాన్ని కేటీఆర్ అభినందించారు .
ప్రభుత్వ సాయం ప్రతి ఒక్కరికి అందాలని స్పష్టం చేశారు పక్కదారి పట్టకుండా చూడాలని, అలాగైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఈ క్రమంలో ఆధార్ వివరాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.

 ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ లతో కలిసి నాగోలు డివిజన్ అయ్యప్ప కాలనీలో వరదనీటి బాధితులను కేటీఆర్ పరామర్శించారు. వారికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  త్వరలో అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారని పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష , పాక్షికంగా దెబ్బతిన్న వాటికి 50 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు .
వరద నివారణకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా పడతాయి అన్న ప్రశ్న వచ్చినప్పుడు షెడ్యూలు ప్రకారమే జరిగే అవకాశం ఉందని కేటీఆర్ అన్నట్లు తెలిసింది. గ్రేటర్ లో వరదల వల్ల అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నేపథ్యంలో తాజాగా కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సహాయం చేయడంతో పరిస్థితులు మారుతాయని టిఆర్ఎస్ పట్ల సానుభూతి రావొచ్చని అంటున్నారు. రావొచ్చని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: