తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి ఎవరు వెళ్తారు అనేదానిపై చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ నుంచి క్యాబినెట్లోకి ఎవరు తీసుకుంటారు అనే దానిపై బిజెపి నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి ఎవరు వెళ్లే అవకాశం కూడా లేకపోవచ్చు అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో సర్వే నిర్వహిస్తే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వాతావరణం ఉందని కాబట్టి ఇప్పుడు అనవసరంగా పదవులను ప్రకటిస్తే ఇబ్బంది పడతామని భావించారట.

అటు నేతలు కూడా స్వేచ్ఛగా పని చేయలేక పోవచ్చు అనే వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానం నుంచి వినబడుతున్నాయి. దీనితో మంత్రి పదవులను ఆశించిన ధర్మపురి అరవింద్ సహా కొంతమంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. అయితే వారికి మరోరూపంలో న్యాయం చేయాలి అని కూడా బిజెపి నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు బల పడకపోయినా దాదాపుగా ఇంకో ఐదేళ్లు అయినా పట్టే అవకాశాలు ఉండవచ్చు. 2024 కి ఆ పార్టీకి దాదాపుగా అవకాశాలు లేవు అని చెప్పాలి.

2029 నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయితే మినహా బీజేపీకి అవకాశం లేకపోవచ్చు. ఈ లోపు కొంతమంది నేతలను వ్యక్తిగతంగా ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి పదవులను మాత్రం ఇతర రాష్ట్రాలకు ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారట. ప్రధానంగా తమిళనాడు నుంచి మంత్రిని తీసుకునే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. అన్నా డిఎంకె నుంచి ఒక కేంద్ర మంత్రి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ చర్యలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: