ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆయనకు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ప్రధానంగా కొంతమంది నేతల తీరు కారణంగా సీఎం జగన్ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆయనను ప్రశాంతంగా ఉంచడం లేదు. తాజాగా కొంతమంది నాయకులు చేస్తున్న చర్యలు చాలా చికాకుగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా అవినీతి వ్యవహారాలలో కొంతమంది ఎక్కువగా తల దూరుస్తున్నారు.

రాయలసీమ జిల్లాల్లో అదే విధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుపై కూడా చాలా వరకు కూడా జగన్ లో ఆగ్రహం ఉంది. ఎన్ని సార్లు సీఎం జగన్ చెప్పిన సరే కొంతమందిలో అసలు మార్పు రావడంలేదు. దీంతో చర్యలు తీసుకోవడానికి సీఎం జగన్ రెడీ అవుతున్నారు. కొంతమంది మంత్రులకు నేరుగా సూచనలు సలహాలు ఇచ్చినా సరే వాళ్ళు అవినీతి వ్యవహారాల్లో ఉండటంతో వారి మీద అవసరమైతే విచారణ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్  లో చాలా వరకు ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి అని చెప్పాలి.

రాజకీయంగా కూడా పరిస్థితులు కాస్త కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంను పెట్టాలి అని భావిస్తున్న సమయంలో వైసీపీ నేతలు జాగ్రత్తగా లేకపోతే మాత్రం అనవసరంగా సీఎం జగన్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీంతో కొంతమంది మీద జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎవరైతే అవినీతి వ్యవహారంలో ఎక్కువగా ఉంటారో... వారందరినీ కూడా ఒకసారి పిలిచి మాట్లాడాలని అనవసరంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదురు కాకూడదని ఆయన సూచనలు చేస్తున్నారు. మరియు భవిష్యత్తులో వైసీపీ నేతలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: