తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొంతమంది మంత్రులు ప్రవర్తిస్తున్న తీరు పై విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అర్ధమవుతుంది. దీంతో అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు కూడా కాస్త ఘాటుగానే విమర్శలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే చాలామంది నేతలు ఇప్పుడు ప్రజల్లోకి రాకుండా విమర్శల పాలవుతున్నారు.

అంతేకాకుండా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో చాలా మంది అధికార పార్టీ నేతలు ఇళ్లలోనే ఉండటంతో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో అయితే చాలా వరకు పంట దెబ్బతిన్న కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలను కనీసం కష్టాలు అడగటం లేదు. అదే విధంగా నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలు కూడా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. నల్గొండ జిల్లాలో కూడా టిఆర్ఎస్ పార్టీలో చాలామంది కీలక నేతలు ఉన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కాస్త ప్రజల్లోకి వెళ్తున్నారు. అయినా సరే టిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ప్రజలకు కనబడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు వెళ్లి నాయకులు కలవడమే గాని  నాయకులు వచ్చి మీకు ఇబ్బంది ఉందా అని అడిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఈ రెండు జిల్లాల నేతలకు సీఎం కేసీఆర్ కాస్త ఘాటుగానే వార్నింగ్  ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకు బయటకు రావడం లేదు అనేది  వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: