ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురిసిన  భారీవర్షాలకు నగరం అతలాకుతలం అయింది. ఇప్పటికి నగరంలో చాలా కాలనీలు నీటితోనే ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఓవైపు సహాయ చర్యలు చేపడుతున్న.. ముంపుకు గురైన నగర వాసుల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎగువ మధ్య తరగతి వాళ్ళ కష్టాలు అయితే తమ అపార్ట్మెంట్లో కి వరద నీరు చేరడం తో చాలా ఇబ్బందులు  పడుతున్నారు. అంతేకాకుండా వరదల్లో చాలా కార్లు కొట్టుకుపోగా, 1-2 లక్షలకుపైగా కార్లు చెడిపోయాయి. అదేవిధంగా దిగువ మధ్య తరగతి కి చెందిన ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు .


 వీళ్లకు సంబంధించి మూడు నుంచి నాలుగు లక్షల వరకు టూ వీలర్స్ పాడైపోయాయి, మరికొన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో నగరంలో ఉన్న ఇన్సూరెన్స్ వాళ్లకు , బైక్ మెకానిక్ లకు కు క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటుంది అంటున్నారు. మరోపక్క రోడ్లు బాగా దెబ్బతినడంతో ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగుల ఉద్యోగుల కష్టాలు అయితే వర్ణనాతీతం. ఒకవైపు కరోనా సంక్షోభంతో చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో భారీ వర్షాలు కురవడంతో కోలుకోలేని దెబ్బ తగిలిందని నగర వాసులు వాపోతున్నారు. వర్షాలు తగ్గి రెండు మూడు రోజులైనా డ్రైనేజీ వ్యవస్థ బాగా దెబ్బతినడంతో ఇప్పటికీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.


వరదల్లో చిక్కుకొని ఆర్థికంగా నష్టపోయిన స్థానికులను ఆదుకునేందుకు ఇప్పుడిప్పుడే దాతల నుంచి విరాళాలు సమకూరుతున్నాయి. నగర వాసులు మాత్రం ఇలాంటి వర్షాలు ఒక దశాబ్ద కాలం పాటు మునుపెన్నడూ లేవని ఇదే ఫస్ట్ టైం చూడమని అంటున్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను ఇంకా వేగవంతం చేయాలని, ఆర్థికంగా నష్టపోయే వాళ్ళని ఆదుకోవాలని, నగరం పరిధిలో ఉన్న అన్ని ముంపు కాలనీలోని ప్రభుత్వ అధికారులు సందర్శించి.. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: