జగన్... ఏపీ యువ ముఖ్యమంత్రి. ఆయన చాలా విషయాల్లో స్పెషల్ గా ఉంటారు. ఆయన వ్యవహార శైలి చాలామందికి భిన్నం. అంతే కాదు, ఆయన కంటే ముందు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ నేత చంద్రబాబుతో జగన్ కి ప్రతీ విషయంలో పోలిక పెడతారు. ప్రత్యేకించి ఆ విషయంలో ఇంకా ఎక్కువగ  పోలిక పెడతారు జగన్ మీడియా బేబీ కానే కాదు, ఒక విధంగా చెప్పాలంటే జగన్ మీడియాకు దూరంగా ఉంటారు.

తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఆయన పద్ధతి ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఎంత పెద్ద పని చేసినా సంబంధిత మంత్రి ద్వారానే మీడియాకు చెప్పిస్తారు తప్ప ఆ క్రెడిట్ తాను తీసుకోవాలనుకోరు. జగన్ కి ప్రచార యావ లేదు. ఆయనకు ఒక విషయం బాగా తెలుసు. ఎంత ప్రచారం చేసుకున్నా జనాలకు అసలు విషయాలు ఎలాగూ తెలుస్తాయి. తాము పనిచేస్తే ఆ పనే పది రకాలుగా ప్రచారం చేసిపెడుతుంది అని కూడా తెలుసు.

అందుకే ఆయన మీడియాకు దూరం పాటిస్తారు. ఇక్కడ ఒక డేటా తీసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. గత ఏడాదిన్నర పాలనలో  జగన్ మూడంటే మూడు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. అంటే ఇది నిజంగా విచిత్రమే. అదే సమయంలో చంద్రబాబుని తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా సగటున వారానికి నాలుగు సార్లు మీడియా మీటింగులు పెట్టేవారట‌. దాన్ని బట్టి బాబు మీడియాతో రిలేషన్స్ ఎంతలా మెయింటెయిన్ చేశారో అర్ధమవుతుంది.

ఒక విధంగా మీడియాతో అంత సాన్నిహిత్యం నెరపిన చంద్రబాబుకు జనం ఏ విధమైన తీర్పు ఇచ్చారో 2019 ఎన్నికల్లో అందరూ చూశారు. మాటలు ఒకటికి పదిసార్లు చెప్పినా జనం మెచ్చి అందలం ఎక్కించరు. అదే ఏం మాట్లాడకుండా మౌనగా ఉన్నా పని జరిగితే వారే ఒకటికి పదిసార్లు జై కొడతారు. అందుకే జగన్ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారు. మా నేతకు ప్రచార ఆర్భాటం లేదు  ఇది మేము గర్వంగా చెప్పుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారంటే అది ఒక విధంగా జగన్ గొప్పతనమే. మొత్తానికి జగన్ పనితనమే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుంది అని వైసీపీ నేతలు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: