ప్రపంచంలో మాఫియా సామ్రాజ్యం ఏవిధంగా అభివృద్ధి చెందిందో మనము చూస్తూనే ఉన్నాము. దీని వలన ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. అదేవిధంగా మన దేశంలో కొందరు కరుడుగట్టిన మాఫియా డాన్ లు ఉన్నారు. వారిలో ఒకరే  మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన దేశాలలో తన మాఫియా సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ భారత ప్రభుత్వానికి దొరకకుండా ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియట్లేదు. అటువంటి వ్యక్తిపై ఇప్పుడు ఒక వార్త సామజిక మాధ్యమాల్లో షికారు చేస్తోంది. అదేమిటో తెలుసుకోవాలనుందా అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.

దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు....అయితే ఈ వేలాన్ని నవంబర్ 10 న మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలియచేసారు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ఈ వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఆస్తుల వాల్యుయేషన్ ప్రక్రియ గతేడాదే పూర్తయిన విషయం తెలిసిందే. దావూద్ పూర్వీకులు అప్పట్లో రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో నివాసం ఉండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్ కు స్థిరాస్తులు ఉన్నాయి. ఖేడ్లోని విలువైన ఆస్తులు దావుద్ సోదరి హసినా పార్కర్ పేరు మీద మిగిలినవి తల్లి అమినా పేరు మీద ఉన్నాయి.
 
ఈ బంగ్లాని దావూద్ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద ఆస్తి రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దీనిని దావుద్ కుటుంబసభ్యులు విడిచి పెట్టి వెళ్లారు. అది అప్పటినుండి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం పూర్తిగా శిధిలా వ్యవస్థకి చేరింది. తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం కోటి రూపాయల విలువ కలిగిన 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: