ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు కి భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విషయంలో న్యాయస్థానాల్లో ఎప్పుడూ జాప్యం జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎన్ని కేసులు నమోదు అయినప్పటికీ అవి సరిగ్గా విచారణకు రావు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన అన్ని కేసులను శరవేగంగా రోజువారీగా దర్యాప్తు చేపట్టాలని దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.



 ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం ప్రజాప్రతినిధులు  అందరికీ భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి  కోర్టులో విచారణకు రాని కేసులు కూడా మళ్లీ తెర మీదికి వచ్చి ప్రజా ప్రతినిధులందరూ కోర్టుకు  హాజరు కావాల్సి ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ కూడా శరవేగంగా జరుగుతోంది. అటు ఏపీలో కూడా ఇప్పటికే చంద్రబాబు సంబంధించిన పలు కేసులు హైకోర్టులో విచారణ కు వచ్చిన విషయం తెలిసిందే.



 కానీ జగన్కు సంబంధించిన కేసులు మాత్రం వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం సిబిఐ ఈడి కోర్టు లో ఉన్నటువంటి జగన్ కేసులు వేగవంతంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో... జగన్ కేసు పదేపదే వాయిదా పడుతూ వస్తున్నాయి. జగన్ కేసుల విషయంలో రోజువారీ విచారణ జరగడం లేదు. సిబిఐ ఈడి కోర్టు న్యాయమూర్తి సెలవు కారణంగా ఇలా జగన్ కేసులు వాయిదా పడుతూ వస్తున్నట్లు  విశ్లేషకులు చెబుతున్నారు. నవంబర్ 27 కి సీబీఐఈడీ  కోర్టులో కేసులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాంపల్లి సీబీఐ కోర్టులో కేసు కూడా నవంబర్ 9కి వాయిదా పడింది. మరి కొన్ని కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి.. ఇది నవంబర్ 5న విచారణ జరగనున్నాయి. ఇలా  జగన్ కేసును వాయిదా పడుతూ వస్తున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: