చైనా ఎప్పుడూ నీచమైన వ్యూహాలు అమలు చేస్తూ ప్రపంచ దేశాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వివిధ దేశాల కు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు ఎన్నోరకాలుగా డబుల్ గేమ్ ఆడుతూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు చైనా వివిధ దేశాల కు సంబంధించిన కీలక సమాచారాన్ని సహకరించేందుకు ఎన్నో అప్పుడు మార్గాలను ఎంచుకుంటుంది అనే విషయం కూడా బయటపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల అమెరికాలో వివిధ స్థాయిలలో ఉన్న చైనా కు  సంబంధించిన ఉద్యోగుల నుంచి రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా తస్కరించేందుకు  ప్రయత్నించింది అనే విషయం కూడా బయటపడింది.



 ఈ క్రమంలోనే చైనా కు సంబంధించిన ఉద్యోగులు ప్రొఫెషనల్ ను  అమెరికా ప్రభుత్వం అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇలా ప్రపంచ దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు  ఎన్నో రకాలుగా మోసాలకు పాల్పడుతూ నే ఉంటుంది చైనా. ఇక చైనా పాల్పడే మోసాలు సైబర్ నేరాల కంటే మరింత దారుణంగా ఉంటాయి  అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు సరికొత్త మోసాన్ని మొదలు పెట్టింది చైనా. చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి కొంతమంది హ్యాకర్లు.. యూజర్లను బోల్తా కొట్టించేందుకు కంప్యూటర్లకు వైరస్లో మాల్వేర్ను ప్రొజెక్ట్ చేస్తారు.




 ఇక ఆ తర్వాత వాటిని ఎదుర్కొనేందుకు ఉద్దేశించి నటువంటి యాంటీవైరస్ లకు సంబంధించి డూప్లికేట్ తయారు చేసి  యూజర్లు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఎంతో ఆకర్షణీయంగా మలిచి.. యూజర్లు డౌన్లోడ్ చేసుకునేలా చేస్తున్నారు.. ఇలా ఎన్నో ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ల లాగానే డూప్లికేట్ లు తయారు చేస్తూ... ఎంతోమంది యూజర్లను డూప్లికేట్ సాఫ్ట్వేర్ నిజమైనది అని నమ్మిస్తూ అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత.. కీలక సమాచారాన్ని దొంగలించేందుకు ప్రస్తుతం చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని ఇటీవలే గూగుల్ విపత్తు  విశ్లేషణ విభాగానికి సంబంధించినటువంటి షేన్ హ్యాంక్లి  హెచ్చరికలు జారీచేశారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చైనా ఇలాంటి తరహా మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: