భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్తతల  నేపథ్యంలో రోజురోజుకు ఎంతో వ్యూహాత్మకమైన అడుగులు ముందుకు వేస్తుంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారత ఆర్మీ ని పటిష్టం చేసేందుకు డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన ఎన్నో భారత ఆయుధాలను  అమ్ములపొదిలో చేరుస్తున్న విషయం తెలిసిందే. ఏ క్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలు కొనుగోలు చేయడంతోపాటు స్వదేశంలో తయారైన ఆయుధాలకు ప్రయోగాలు నిర్వహించి  విజయవంతం అయిన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేరుస్తున్న విషయం తెలిసిందే . అయితే భారత రక్షణ పరిశోధన సంస్థ ఇటీవలే బ్రహ్మోస్ మిస్సైల్ తయారు చేసిన విషయం తెలిసిందే.




 డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఆయుధాలు లోనే బ్రహ్మోస్ మిస్సైల్  ఒక సరికొత్త అధ్యాయంగా మారింది. అయితే బ్రహ్మోస్ మిస్సైల్  ప్రస్తుతం భారత ఆర్మీని  ఎంత శక్తివంతం చేసే ఆయుధం అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రహ్మోస్ పరీక్షలు విజయవంతం అయ్యాయి. అటు భూమ్మీద నుంచి మరో వైపు యుద్ధ నౌకల నుంచి కూడా బ్రహ్మోస్ మిస్సైల్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంతో సమర్థవంతంగా చేదించకలిగింది  అని డీఆర్డీవో అధికారులు తెలిపారు. అయితే బ్రహ్మోస్ ఒకసారి విజయవంతమైనప్పటికీ  మళ్లీ మళ్లీ బ్రహ్మోస్ మిస్సైల్ కి సంబంధించి పరీక్షలు జరుపుతూనే ఉంది డి ఆర్ డి ఓ.




 అయితే అధునాతన టెక్నాలజీని బ్రహ్మోస్ మిస్సైల్ లో చేర్చడంతో పాటు.. బ్రహ్మోస్ మిస్సైల్ యొక్క వేగాన్ని పెంచేందుకే పదేపదే పరీక్ష జరుపుతున్నామని.. ఈ మిస్సైల్ యొక్క వేగం పెంచే ప్రక్రియ ఎంతో సీరియస్ గా జరుగుతుంది అని బ్రహ్మోస్ మిస్సైల్  సి ఈ ఓ తెలిపారు.  ఇప్పుడు మరో కీలక సమాచారం కూడా బ్రహ్మోస్ మిస్సైల్  కు సంబంధించి బయటపడింది. హైదరాబాద్లోనే బ్రహ్మోస్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని... అయితే ఈ బ్రహ్మోస్ మిస్సైల్ అభివృద్ధి రష్యా భారత జాయింట్ వెంచర్ గా జరుగుతుందని సమాచారం బయటపడింది. రష్యా నుండి కొంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని భారత దేశంలో ఈ మిస్సైల్ ని  అభివృద్ధి చేస్తుందట డి ఆర్ డి ఓ.

మరింత సమాచారం తెలుసుకోండి: