ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియకు గడువంటూ ఏమీ లేదని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం‌. ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టుకు వివరించిన ఏజీ.. ఇది నిరంతర ప్రక్రియని తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. విచారణను వాయిదా వేసింది.

ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. చట్టబద్దత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని.. ఆధార్‌, కులం వంటి వివరాలు అడుగుతున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేంటని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.

15రోజుల్లో ఆస్తుల వివరాలు నమోదు చేయించుకోవాలంటున్నారని.. పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలపగా.. అలాంటిదేం లేదని అడ్వకేట్‌ జనరల్‌ స్పష్టతనిచ్చారు.  ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదుకు గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని కోర్టుకు వివరించారు. ఆస్తుల నమోదుకు చివరితేదీ లేదన్న ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వివరణను హైకోర్టు నమోదు చేసింది.

ధరణికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. పిల్‌పై విచారణను నవంబరు 3కు వాయిదా వేసింది. మొత్తానికి ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియపై హైకోర్టులో విచారణ జరిగింది.

చట్టబద్ధత లేకుండా వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఆధార్, కులం లాంటి వివరాలు అడుగుతున్నారని వెల్లడించారు. సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేెంటని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ధరణిలో ఆస్తుల నమోదుకు గడువు లేదని ప్రభుత్వం చెప్పింది. ఆస్తుల నమోదు ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని కోర్టుకు ఏజీ తెలిపారు.   అయితే ఏజీ వివరణను హైకోర్టు నమోదు చేసుకుంది. మొత్తానికి ధరణి వెబ్ సైట్ గురించి తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రజల సందేహాలకు నివృత్తి కలిగినట్టయింది.










మరింత సమాచారం తెలుసుకోండి: