అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట...ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీదే పైచేయి. 2014 ఎన్నికల్లో సైతం అనంతలో టీడీపీ సత్తా చాటింది. కానీ 2019 ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ అదరగొట్టే విజయం అందుకుంది. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 12 గెలిస్తే, టీడీపీ 2 గెలుచుకుంది. అటు రెండు ఎంపీ సీట్లు సైతం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

అయితే ఇన్నిసీట్లు గెలిచినా సరే అనంతకు ఒక్క మంత్రి పదవి మాత్రమే వచ్చింది. పెనుగొండ నుంచి గెలిచిన బీసీ నేత శంకర్ నారాయణ జగన్ కేబినెట్‌లో ఉన్నారు. ఇక ఎక్కువమంది గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలకు జగన్ కేబినెట్‌లో స్థానం దక్కలేదు. అయితే జగన్ రెండున్నర ఏళ్లలో మరొకసారి మంత్రివర్గ విస్తరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో పనితీరు బాగోని వారిని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు.

ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అయింది. మరో 13 నెలల్లో జగన్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. దీంతో అనంత నేతలు మంత్రి పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్‌లో ఒక్కరే ఉండటంతో, మరొకరికి ఛాన్స్ దక్కే అవకాశముంది. ఈ క్రమంలోనే పలువురు సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మంత్రి రేసులో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అనంతలో ఈయన బాగా సీనియర్ నేత.

అటు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఏమన్నా అవకాశం దక్కుతుందా అని చూస్తున్నారు. అటు జూనియర్ ఎమ్మెల్యేలు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిల్లో ఎవరోకరికి మంత్రి పదవి దక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా జగన్ ఏదైనా అవకాశం ఇవ్వకుండా ఉంటారని చూస్తున్నారు. మరి చూడాలి అనంతలో ఏ ఎమ్మెల్యేకు జగన్ అవకాశం కల్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: