తనకంటే రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన జగన్ సీఎం అవ్వడం చంద్రబాబుకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ప్రతిరోజూ ఏదొకవిధంగా మీడియా సమావేశం పెట్టడం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు గుప్పించడం చేస్తున్నారు.

ఓ వైపు జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. అలాగే ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు మరింతగా ఉపయోగపడుతున్నాయి. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికీ మెజారిటీ ప్రజల మద్ధతు జగన్‌కే ఉంది. అయినా సరే చంద్రబాబు, జగన్ వల్ల ప్రజలు ఏదో నానా కష్టాలు పడుతున్నారన్నట్లు చెబుతున్నారు. తాజాగా కూడా బాబు అదే బాటలో మాట్లాడుతున్నారు. ఒక్క ఛాన్స్ అని బతిమాలితే జగన్‌కు అధికారం ఇచ్చారని, పదే పదే తప్పుడు పనులు చేస్తూ చివరి ఛాన్స్‌గా చేసుకున్నారని జోస్యం చెప్పారు.

అసలు దోపిడీ చేయడమే జగన్ ఏకైక మార్గమని, రాజధానిని 3 ముక్కలు చేయడం రాష్ట్రానికి ఎంతో నష్టమని, జగన్ చెప్పేవన్నీ అబద్దాలు, చేసేవన్నీ తప్పుడు పనులని తప్పుబట్టారు. అంటే జగన్ వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నట్లు చెబుతున్నారు. బాబు మాటలు చూస్తుంటే గురివింద గుంజ సామెత గుర్తొస్తుందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలంతా అనుభవం ఉన్న నేత కావాలని చెప్పి చంద్రబాబుని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు.

కానీ బాబు గెలిచాక ఏం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపించారు. సంక్షేమ పథకాలని సొంత వాళ్ళకు ఇచ్చారు. ఇంకా అమరావతిలో టీడీపీ నేతల దోపిడికి అంతు లేదని గుర్తు చేస్తున్నారు. ఇక మీడియాలో బాబు ప్రచారమంతా అబద్దమే అని అందుకే 2019 ఎన్నికల్లో బాబుని చిత్తుగా ఓడించి, జగన్‌ని భారీగా మెజారిటీతో గెలిపించారు. ఆ విషయాలు మరిచిపోయి, బాబు గుడ్డిగా జగన్‌పై విమర్శలు చేస్తే జనం నమ్మరని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: