ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సాఆర్‌ బీమా పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో పథకాన్ని ప్రారంభించారు సీఎం‌.

ఏపీలో వైఎస్‌ఆర్‌ భీమా పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. తాడేపల్లి  క్యాంప్‌ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. ఈ పథకాన్ని ప్రారంభించారు జగన్‌. కుటుంబ పెద్ద.. సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఈ భీమా పథకం ఆదుకుంటుంది. రాష్ట్రంలో రైస్‌ కార్డులు కలిగిన కుటుంబాలు వైయస్‌ఆర్‌ బీమా పథకానికి అర్హులు.

18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు ఉండి, కుటుంబాన్ని పోషించేవారికి ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే నామినీకి 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు భీమా పరిహారం అందుతుంది. ఒకవేళ లబ్దిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందినా 5 లక్షలు బీమా పరిహారం అందుతుంది.

51 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల లబ్దిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 3 లక్షలు,  లబ్దిదారుడు శాశ్వత అంగవైకల్యం పొందితే 3 లక్షల బీమా పరిహారం అందుతుంది. 18నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక, శాశ్వత అంగ వైకల్యానికి గురైతే లక్షా 50 వేల భీమా పరిహారం అందిస్తారు.

ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారుల తరఫున బీమా సంస్థలకు ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్‌ చెల్లించనుంది. దీని కోసం ప్రభుత్వం 510 కోట్లు రూపాయలు ఖర్చు చేయనుండగా.. ఈ పథకం వల్ల కోటి 41 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది.

మొత్తానికి ఆపదనలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించేందుకు జగన్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ బీమా పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: