నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాల మంది టైంకి తినడం లేదు. ఆరోగ్యం గురించి పట్టించుకునే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నది. ముఖ్యంగా నగరాల్లో అయితే పొద్దున లేచింది మొదలు రాత్రి పూట నిద్ర పోయే దాకా.. ఒక చిన్నపాటి పోరాటమే చేయాల్సి వస్తున్నది. కానీ ఈ ధ్యాసలో పడి చాలా మంది వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడం, సమయానికి తినకపోవడం, వేళాపాలా లేకుండా ఏది పడితే అది తినడంతో వారికి తెలియకుండానే పొట్ట పెరుగుతుంది.

అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ కూడా ఇబ్బందే. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. దీనిని కరిగించుకోవడానికి జిమ్ లు, ఏరోబిక్ సెంటర్లు, ఎక్సర్ సైజ్ లాంటివి చేసే ఓపిక, సమయం చాలా మందికి దొరకదు. ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒంట్లోకి కొవ్వు చేరిందే మొదలు చాలా మంది పాటించే ఒకే ఒక విధానం ఉపవాసం.

అయితే చాల మందికి భోజనం చేశాక సోంపూ తినడం అలవాటు. అయితే సోంపూ అనేది భోజనం తర్వాత తినే ఓ పదార్థంగానే బావిస్తారు చాలా మంది. కాని తీసుకున్న ఆహారాన్ని సకాలంలో సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుందని చాలా మందికి తెలియదు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సోంపు దిట్ట. అందుకే సోంపు ఇంట్లో ఉండే ఔషది అని ఆయుర్వేదం చెబుతోంది.

ఇక 2 స్పూన్ల సోంపు తీసుకోని 1 గ్లాస్ వాటర్ పోసి  సోంపుగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే పరగడపున తాగాలి. సోంపూ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది బాడీలో మెటబాలిజం రేట్ పెంచుతుంది. దీంతో జీర్ణం త్వరగా అయిపోయి క్యాలరీలు శక్తిగా మారతాయి. పొట్టు చుట్టూతా ఉన్న కొవ్వు కరిగిపోయి శరీరం నాజూగ్గా తయారవుతుంది. సోంపు తిన్న ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. టాక్సిన్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది. నోటి దుర్వాసనను రాకుండా నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: