ఊహా శక్తి పెరిగినప్పుడు చిన్నపిల్లల ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ యుగం వచ్చినప్పటి నుంచి పిల్లలు ఆలోచించడమే మానేశారు. ఆన్ లైన్ గేమ్ లు ఆడుతూ బిజీగా ఉంటున్నారు. కానీ ఊహా శక్తిని సృజనాత్మకతను పెంపొందించుకోవడం మరిచారు. పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులు కథలు చెప్పినప్పుడే ఊహాశక్తి పెరుగుతుంది.

అనగనగా ఒక రాజు.. అని కథ ప్రారంభించడమే లేటు పిల్లలు తమ ఊహా ప్రపంచంలో అడుగులు వేస్తుంటారు. కథలో ఉన్న పాత్రల్లో తమని తాము రాజులు భావించుకుంటారు. ఆలోచించే సామర్థ్యంలో పాటు కలలో దృశ్యాలను కూడా చూసేస్తుంటారు. కథలు చెప్పడం, చదవడం, వినడం వల్ల పిల్లలు తమ సృజనాత్మక భావన పెంచుకుంటారు. ఒక్క కథ వాళ్లకు ఎన్నో ప్రశ్నలకు రేకెత్తిస్తోంది. దీంతో వారి ఆలోచన పరిజ్ఞానం పెరుగుతుంది.

కథల రూపంలో కొత్త కొత్త పదాలు, ప్రదేశాల గురించి వివరిస్తుండటం వల్ల పిల్లలు చెప్పిన విషయాలను ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు. అప్పట్లో అమ్మమ్మ, నానమ్మ, అమ్మ, నాన్న, తాతయ్యలు పురాణాలు, నీతికథలు, జానపదకథలు, హాస్యకథలు, పేదరాసి పెద్దమ్మ కథలు చెబుతుండే వారు. వీటి వల్ల ఎంతో కొంత లోక జ్ఞానం చేకూరేది. కానీ ఇప్పటితరం పిల్లల పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ కాలంలో కథలు చెప్పేవారు కరువయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తే చాలు అందులోనే అన్ని నేర్చుకుంటారని భావిస్తుంటారు. కానీ జరిగేది వేరు. ఆన్ లైన్ గేమింగ్, సైబర్ నేరాల బారిన పడుతున్నారు.

స్మార్ట్ ఫోన్లకు బానిసైన పిల్లలను సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులతో తమ పిల్లలకు మంచి బంధం ఏర్పడితే ఎలాంటి సమస్య ఉండదని సైకాలజిస్టులు చెబుతుంటారు. ఖాళీ సమయాల్లో పిల్లలతో గడపడం. కథలు చెప్పడం. కొత్త విషయాలు నేర్పించడం వంటివి చేస్తే పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: