తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్టు..... స్వర్గస్తులు జయలలిత విషయంలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన తార... తమిళనాడు ముఖ్యమంత్రిగా అక్కడి ప్రజల మన్ననలను పొందుతూ పేరుప్రఖ్యాతులు గాంచిన జయలలిత ఎలా తన జీవితాన్ని ఒంటరిగా గడిపిందో... చివరికి ఎలా తన జీవితం ముగిసిందో అందరికీ విధితమే. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు..... ఎవరినీ తన బంధువులుగా ప్రకటించలేదు... బాహ్య ప్రపంచానికి పరిచయము చేయలేదు... తన స్నేహితురాలు శశికళనే నమ్ముతూ.... ఆమెని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తన ప్రాణ స్నేహితురాలని మురిసిపోయారు జయలలిత... అయితే జయలలిత మరణం అనంతరం విషయం తారుమారైంది....జయలలిత అనంతరం ఆస్తి ఎవరికి దక్కనుంది అన్న ఒక చిక్కుముడి లాంటి ప్రశ్న కు కొత్త సమాధానం దొరికింది.

అనారోగ్యంతో జయలలిత హాస్పిటల్ లో ఉన్నప్పుడు..... ఆమె మేన కోడలు అంటూ దీప ఆస్పత్రికి వచ్చింది.... మొదట ఎవరు నమ్మలేదు కానీ జయలలిత మరణం అనంతరం ఆమెకు ఉన్న భారీ ఆస్తులు ఎవరికి అనే వివాదం చెలరేగింది. జయలలిత మేన అల్లుడు, మేనకోడలు అంటూ దీప, దీపక్ వచ్చారు. కోర్టులో ఎంతగానో పోరాడి చివరికి తమను తాము నిరూపించుకొని...... జయలలిత వారసులుగా హక్కులను చేజిక్కించుకున్నారు. జయలలిత బ్రతికున్న  సమయంలో వీరిని కనీసం దగ్గరకు కూడా రానివ్వకపోయినా చివరికి తన ఆస్తులు వీరి సొంతమయ్యాయి. ఎవరినైతే దూరం పెడుతూ వచ్చిందో చివరికి వారే జయలలిత వారసులుగా చలామణి అవుతున్నారు.

ఇటీవలే జయలలిత కు సంబంధించిన వైట్ మనీ ఆస్తులకు దీప, దీపక్ వారసులుగా మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. తాజాగా జయలలిత నివాసం అయిన వేద నిలయానికి సంబంధించిన డబ్బులు సైతం దీప, దీపక్ లు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఇంటిని మ్యూజియంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించి ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా ఆ డబ్బులను అయితే కటింగ్స్ ఫోను మిగిలిన మొత్తాన్ని దీప దీపక్ లకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మరో అద్భుత అవకాశం దీప, దీపక్ లకు చేరువయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: