ఏపీ సీఎం జగన్ అయినప్పటి నుంచి ఏపీలో ఉద్యోగాల వరద పారుతోంది. అధికారంలోకి రాగానే జగన్ ప్రవేశ పెట్టిన కొత్త సంస్కరణల కారణంగా అనేక వేల ఉద్యోగాలు వచ్చాయి. జగన్ గ్రామ స్వరాజ్యం కాన్సెప్టుతో గ్రామ సచివాలయాలకు, పట్టణాల్లో వార్డు సచివాలయాలకు తెర తేపారు. దీంతో ఆయా కార్యాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఇవి కాకుండా గ్రామ వాలంటీర్లు అన్న కాన్సెప్టు తీసుకొచ్చాడు. దీంతో మరికొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి.


ఇవి కాకుండా రెగ్యులర్ గా అయ్యే నియామకాలూ జరుగుతున్నాయి. మొత్తానికి జగన్ అధికారానికి వచ్చిన ఏడాదిన్నరలోనే లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగారు. దీంతో అనేక మంది కుర్రాళ్లు ఉద్యోగులయ్యారు. అవసరమైన చోట ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనుకాడేది లేదు అన్న జగన్ పాలసీ కారణంగా ఈ ఉద్యోగాలు వస్తున్నాయనే చెప్పాలి. ఉద్యోగాలు ఇస్తే అది ఖాజానాపై భారం అన్నట్టుగా ఉండేది గత ప్రభుత్వాల వ్యవహారం.


కానీ జగన్ మాత్రం దాన్ని సమాజంపై పెట్టుబడిగా చూస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలి.. వాళ్లతో అవసరమైన పని చేయించుకోవాలి.. సమాజంలో మార్పు తీసుకురావాలి అన్నది జగన్ కాన్సెప్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పోలీస్‌ శాఖలోనూ త్వరలోనే మరిన్ని పోస్టులు ఇస్తామని జగన్ ప్రకటించారు.


పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామంటున్నారు జగన్. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. అంతే కాదు.. ఈ పోలీసు శాఖలో ఉద్యోగాలను ఏటా క్రమం తప్పకుండా ఇస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్. అలాగే.. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.  రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించారు జగన్. కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్‌స్టేషన్లను తీసుకొచ్చారు. దిశా బిల్లును కేంద్రానికి కూడా పంపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: