కరోనా వైరస్ అనే చీడపురుగు ఇప్పటికీ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచ దేశాలను  కలవరపెడుతూ తన క్రూరత్వాన్ని చాటుతోంది.... కొంతమంది ఈ వైరస్ అంత ప్రమాదకారి కాదని నమ్మి తమ కార్యకలాపాలను ఎప్పటిలాగే కొనసాగిస్తుంటే..... మరికొందరు ఈ వైరస్ సోకితే మరణం తప్పదని అన్నట్టుగా భయపడి ఇంట్లోంచి కాలు బయటకు పెట్టడం లేదు. ఇప్పటికీ బయట జనసంచారం కొంచెం అటు ఇటు గానే ఉంది. అయితే  యువకులపై కోవిడ్ 19 వైరస్ పెద్దగా ప్రభావం చూపడం లేదని....బలమైన రోగనిరోధక శక్తి ఉండడంతో రక్షణగా నిలుస్తోందని వైద్యులు చెబుతుంటే.... యువకులు హమ్మయ్య అనుకోకుండా....దీన్నే కొందరు యువత అవకాశంగా మలచుకొని వ్యాపారంగా మార్చేశారు. కరోనా బాధితుల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్నారు. కరోనాను క్యాష్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.        

అమెరికాలోని ఇదహోంలో గల బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థుల వింత వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థుల తమ ఆరోగ్యాలతోనే చెలగాటం ఆడుతున్న వైనం అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి తెలిసి.... దగ్గరకు వెళ్లి మరీ అంటించుకుంటున్నారు.. కరోనా రోగులు అంటే ఆమడ దూరం ఉండే ప్రజలు ఓ వైపు అయితే... ఈ విద్యార్థులు మాత్రం కరోనా ను పిలిచి మరీ పెట్టుబడిగా మార్చేసుకున్నారు. కరెన్సీ కోసం కరోనాను అంటించుకుంటున్నారు. తర్వాత ఆ వ్యాధి నుంచి కోలుకొని ప్లాస్మా దానం పేరుతో సమాజ సేవకుల్లా పరితపిస్తూ.... వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారు. కరోనాకు మందులు, చికిత్స లేకపోవడంతో ప్రాణం పోయే దశలో ఉన్న వారిని ప్లాస్మా చికిత్సతోనే బతికిస్తున్నారు వైద్యులు. దీంతో ఈ విద్యార్థులు ప్లాస్మా డోనర్లుగా అవతారం ఎత్తి డబ్బులకు తమ ప్లాస్మాను అమ్ముకుంటున్నారు. ఈ విషయం సంచలనంగా మారడంతో విషయం తెలిసి షాక్ అయిన బ్రిఘం యంగ్ వర్సిటీ అధికారులు విచారణ మొదలుపెట్టారు.

బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థులు కరోనాను అంటించుకొని కోలుకొని ఆ తర్వాత ప్లాస్మాను హాస్పిటల్స్ కు భారీ రేట్లకు అమ్ముకుంటున్న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. డబ్బుల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యార్థులను డిబార్ చేస్తామని స్పష్టం చేశారు. ఇలా 119మంది విద్యార్థులు ప్లాస్మా వ్యాపారం చేస్తున్నట్టు వెలుగుచూసింది. ఒక్కో యూనిట్ కు 100 నుంచి 200 డాలర్లు చొప్పున అమ్ముకున్నారని తెలిసింది. ఏదేమైనా దేశానికి అండగా నిలవాల్సిన యువతే ఇలా పక్కదారి పట్టడం అందరినీ బాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: