ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కి ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. ప్రజల తీర్పును ఆయన గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన జగన్ ను ఎప్పుడూ విమర్శిస్తూ ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటికే పడిపోయిన పార్టీ ని చక్కదిద్దుకోవాల్సింది పోయి వయసు, అనుభవం, సీనియారిటీ అన్ని ఉంది కూడా ఇలా చేస్తుండడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు.. ఇటీవలే ఆ పని నెత్తినేసుకుని తిరుగుతున్నా లేట్ అయిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది..

ఇప్పటికీ టీడీపీ ఓటమికి గల కారణాలను స్పష్టంగా చెప్పని చంద్రబాబు అండ్‌కో.. ప్రజలు మాత్రం ఓటు వేయలేదని మాత్రం చెబుతున్నారు.అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి , ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం ఒక్క టీడీపీ కే చెల్లింది.. ఒక్కరా ఇద్దరా... తెలుగు దేశంపార్టీ అధినేత తో సహా ప్రతి తెలుగు లీడర్ ప్రజలను పట్టించుకోకుండా తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకు కష్టపడినవారే.. అలాంటి వారికి ఈ సారి దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి చెప్పగా కొందరిని అయితే జాడ కూడా లేకుండా చేశారు ప్రజలు.. కొన్ని చోట్ల ప్రజలు టీడీపీ ని గుర్తుంచుకుని కాస్తో కూస్తో ఓట్లు పడినా ఆ గౌరవాన్ని కూడా కాపాడుకోలేకపోతుంది టీడీపీ..

ఇక తమకు ఆది నుంచి అండగా ఉన్నా బీసీలు దూరం అయ్యారని బాబు సహా ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలైన యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెం నాయుడు సహా తదితర నేతలు ఒప్పుకున్నారు. తిరిగి బీసీలను మళ్లీ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా.. బీసీలతో ముడిపెట్టి మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అదే సమయంలో బీసీలకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాజకీయ పరమైన విధానాలపై విమర్శలు చేస్తున్నారు. అలా అయితే బీసీ లు ఎలా వారి దగ్గరకి వస్తరన్నది అసలు ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: