రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌లతో ఉన్న బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం.. ఆదిశ‌గా కావాల్సిన కార్యాచ‌ర‌ణ‌ను త‌న‌దైన శైలిలో అమ‌లు చేస్తోంది. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ లో పార్టీ కొంత కొంత బలపడుతుందని చెప్పొచ్చు.. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ ఎంత ఆసక్తి గా ఉందంటే ఇప్పటికిప్పుడు ప్రజలు అధికారం ఇస్తే చేపట్టే ఆలోచనలో ఉంది.. అయితే వెనుకా ముందు చూసుకుకోకుండా ఎలా బీజేపీ అధికారాన్ని చేపడుతుందన్నదే ప్రశ్న.. వాస్తవానికి గతంలో లేనంత దూకుడుగా ప్రజల్లో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. సోము వీర్రాజు ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్లడం లో చాలా వరకు సక్సెస్ అయ్యారు..

ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న నాయ‌కుల‌ను బీజేపీ సార‌థులుగా నియమించింది. దీంతో పాటు స‌ద‌రు నాయ‌కులకు వాగ్ధాటి కూడా ఉండ‌డం పార్టీకి క‌లిసి వ‌చ్చే ప‌రిణామం. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమైనా చేయమని సోము కి కేంద్ర ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందట.. అందుకే తగ్గట్లే  ఎవ‌రిపై అయినా విమ‌ర్శలు చేయ‌డంలో వీర్రాజుకు ఏ మాత్రం మొహ‌మాటం ఉండ‌దు అన్న సంగతి తెలిసిందే..రాష్ట్రంలో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను అజెండాగా తీసుకుని.. ఆయ‌న ఇచ్చిన పిలుపు స‌క్సెస్ అయింది. పార్టీలో నేత‌లు.. మూకుమ్మడిగా.. రాష్ట్రంలో జ‌రిగిన ఒక రోజు ఉద్యమానికి క‌దిలి వ‌చ్చారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ బీజేపీ దూకుడు ప్రద‌ర్శించింది. నాయ‌కులు రోడ్లెక్కారు. ప్రభుత్వంపై విరుచుకుప‌డ్డారు.

ఇక ఇటీవలే సోము వీర్రాజు ఫై పార్టీ లో వ్యతిరేకత ఎక్కువైందని చెప్పొచ్చు.. పార్టీలో ఉన్న వారిలో చాలా మందికి సోము వీర్రాజు అంటే పెద్దగా ప‌డడం లేదు. అయినా.. తాజాగా ఉద్యమానికి క‌లిసివ‌చ్చి.. ఈ రేంజ్‌లో ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, రోడ్లెక్కడం వెనుక‌.. వేరే ఆలోచ‌న ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. మంత్రి నాని.. నేరుగా కేంద్రంలోని ప్రధాని న‌రేంద్ర మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేసిన నేప‌థ్యంలోనే సీనియ‌ర్లు రోడ్లెక్కార‌ని, రాష్ట్ర బీజేపీ విష‌యంలో కాద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. మరి సోము వీరిని తన దారిలోకి తెచ్చుకోగలడా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: