మహబూబాబాద్ దీక్షిత్ కిడ్నాప్ కేసు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. నాలుగు రోజులుగా పోలీసులకు చుక్కలు చూపిస్తుంది బాలుడిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్... అసలు ఇప్పటి వరకు కూడా ఎక్కడా  చిన్న క్లూ కూడా రాకుండా జాగ్రత్త పడుతుంది. ఐటీ కోర్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా ఇప్పటి వరకు అసలు ఏ చిన్న ఆధారం కూడా దొరకలేదు. బాలుడి తల్లి ఫోన్ కు కిడ్నాపర్ ల  ఫోన్ లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బాలుడి తండ్రి డబ్బులు కూడా తీసుకుని వెళ్ళాడు. డబ్బు మూటతో కిడ్నాపర్లు చెప్పినచోటే రాత్రంతా పడిగాపులు కాసినా సరే వాళ్ళు రాలేదు.

చేసింది ఇంటర్ నెట్ కాల్ కావడంతో ట్రేసౌట్ చేయలేకపోతున్నారు పోలీసులు.  ఇక జాతీయ దర్యాప్తు సంస్థ... ఎన్ ఐ ఏ ను రంగంలోకి దించే అవకాశం ఉందని తెలుస్తుంది. కిడ్నాప్ పై డీజీపీ మహేందర్ రెడ్డి తో మాట్లాడిన కేటీఆర్... పలు సూచనలు చేసారు. ఇప్పటి వరకు పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు ఏ మాత్రం కూడా ఆధారాలు రాలేదు. కిడ్నాపర్ డిమాండ్ మేరకు 45 లక్షలు చేత పట్టుకొని నిన్న మధ్యాహ్నం నుండి బాలుడి తండ్రి ఎదురు చూసాడు. కిడ్నాపర్ మధ్యాహ్నం సూచించిన మూడు కోట్ల సెంటర్ నుండి.. మరోచోటకు రమ్మని సూచించడంతో క్యాష్ బ్యాగుతో వెళ్ళాడు.

ఇప్పటి వరకు బాలుడి తల్లికి 15 సార్లు ఇంటర్నెట్ కాల్  చేసాడు కిడ్నాపర్. నిన్న  ఒక్క రోజే ఐదు సార్లు ఫోన్ చేసారు. 30 లక్షలు ఇచ్చేందుకు  ముందు ఒప్పందం చేసుకుని కిడ్నాపర్ చెప్పిన అడ్రస్ లో చూసారు.  ఆ తర్వాత మరో 15 లక్షలు కూడా రెడీ చేసారు. నాలుగు గంటల తర్వాత మరోచోటుకి రావాలని కిడ్నాపర్ డిమాండ్ చేసాడు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని తెలియని ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: