దేశంలో రోజురోజుకు పేదరికం పెరిగిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. కనీసం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక తీవ్ర దుర్భర స్థితిలో ఉన్న  ప్రజలు కూడా ఇప్పటికే దేశంలో ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఎంతో మంది చిన్న పిల్లలు కనీసం తినడానికి తిండి లేక రోడ్లమీద బిచ్చగాళ్ళుగా  మారిపోయి కనిపించిన వారినల్ల తిండి  కోసం డబ్బులు అడిగే ఎన్నో హృదయ విదారక ఘటన లు  ఎప్పుడూ మనకు తారసపడుతునే  ఉంటాయి. ఇలా అందరి బతుకులు మారుతున్నాయి కానీ దారిద్ర్య రేఖకు దిగువన ఉండి కనీసం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొన్ని కుటుంబాల పరిస్థితి మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది.



 ముఖ్యంగా ఎంతో మంది చిన్న పిల్లలు కనీసం తినడానికి తిండి లేక ఎవరైనా పట్టెడన్నం పెట్టిస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్న ఘటనలు కూడా అప్పుడప్పుడు  కనిపించి హృదయాన్ని ఒక్కసారిగా కలిచి  వేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది ధనవంతులు ఆహారాన్ని ఎంతో వృధా చేస్తూ ఉంటే మరి కొంత మంది పేదవాళ్ళు మాత్రం కనీసం కడుపు నింపుకోవడానికి అన్నం లేక  తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కరోనా  వైరస్ సంక్షోభం ముందు నుంచే ఈ దారుణ పరిస్థితి దేశంలో ఉండగా ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది.



 కేవలం ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఇటీవల నిపుణులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒక చిన్నారి కడు పేదరికంలో మగ్గుతున్నటు ఇటీవలే యునిసెఫ్ అంచనా వేసింది. ఇందులో 20 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులను వున్నారు అంటూ యునిసెఫ్ తెలిపింది. ప్రపంచ బ్యాంకు గ్రూప్ తో చేసిన విశ్లేషణ లో ఈ విషయాలను వెల్లడించింది యూనిసెఫ్, ఇక ఇప్పుడు కరోనా  వైరస్ సంక్షోభంలో  వారి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది అని ప్రభుత్వాలు అలాంటి వారిని ఆదుకోవడానికి కీలక చర్యలు చేపట్టాలి అంటూ యూనియన్ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: