భారీ వర్షాలు వరదల కారణంగా హైదరాబాద్ తీవ్రస్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనపడటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి హైదరాబాదులో నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సాధారణ స్థితికి తీసుకురావడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు రాకుండా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

రాజకీయంగా కూడా ఇప్పుడు తీవ్రస్థాయిలో హైదరాబాద్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి మంత్రులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరి కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కి పునర్వైభవం తీసుకు వచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేసే క్రమంలో సినీ పెద్దలను వాడుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాదులో వరదల కారణంగా చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం కనబడటంలేదు.

దీనితో హైదరాబాద్ లో ప్రచారం చేయించాలని... దీనికోసం సినీ పెద్దలను వాడుకోవాలని భావిస్తున్నారు. మహేష్ బాబు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి హీరోలను హైదరాబాద్ ప్రచారానికి వాడుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రణాళికతో మంత్రి కేటీఆర్ వారిని  కలిసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా ఐటి కంపెనీలకు ఇస్తున్న రాయితీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయించే విధంగా కొంతమంది హీరోలు ఇప్పుడు ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కొంతమందికి స్వయంగా ఫోన్ కూడా చేసి అడిగినట్లుగా తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇప్పుడు హైదరాబాద్ ని ఎక్కడికి తీసుకుని వెళతాయి అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: