చంద్రబాబునాయుడు జీవిత చరమాంకంలో ఉన్నారు. ఆయన యువకుడిగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. పెళ్ళి కాకుండానే చిన్న వయసులో మంత్రి అయ్యారు. ఆ తరువాత మామ ఎన్టీయార్ టీడీపీని స్థాపిస్తే అందులో చేరి చక్రం తిప్పారు. ఆ పార్టీ ద్వారానే మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇపుడు చూస్తే  వయోభారం పెరుగుతోంది. గత ఏడాది పార్టీకి దక్కిన ఘోర పరాభవం కూడా  ఆ వెనకనే  బాధిస్తోంది.

సరే ఇవన్నీ ఇలా ఉంటే కలల రాజధాని అమరావతి కళ్ల ముందే కరగిపోతోంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని కళ తప్పింది. దాని మీద ఏడాదిగా ఉద్యమాలు రైతులు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన తెలుగుదేశం పార్టీ అయితే ఏకైక అజెండాగా తీసుకుని పోరు సాగిస్తున్నారు. కానీ ఇవాళ డేట్ మాత్రం చంద్రబాబుకు చాలా బాధిస్తోందిట.

అదే అక్టోబర్ 22. సరిగ్గా అయిదేళ్ళ క్రితం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఈ 2015 అక్టోబర్ 22 ఇదే డేట్ న అంటే విజయదశమి రోజున అమరావతి రాజధానికి ప్రధాని హోదాలో మోడీ శంఖుస్థాపన చేశారు. ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణా నుంచి కేసీయార్ ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఇక మరో వైపు చూసుకుంటే రానున్న రోజులలో  అమరావతి రాజధాని  దివ్యమైన భవ్యమైన నగరంగా విలసిల్లుతుందని ప్రధాని సహా వక్తలు అంతా చెప్పారు.

కానీ జరిగింది వేరుగా ఉంది. అక్కడ నుంచి మరో నాలుగేళ్ల సమయం  ఉన్నా చంద్రబాబు గ్రాఫిక్స్ తో కాలం నెట్టుకొస్తే జగన్ వచ్చాక అమరావతిని పక్కన పెట్టేశారు మరో మూడున్నరేళ్ల వరకూ ఎన్నికలు లేవు. 2024లో అమరావతి అజెండా మీద ఎన్నికలు జరిగి బాబు అధికారంలోకి వస్తేనే ఈ రాజధానికి ఏమైనా కదలిక ఉండేది. మొత్తానికి ఇపుడు తానుగా, ఒక పార్టీ అధినేతగా ఏమీ చేయలేక  ఫ్లాష్ బ్యాక్ ని తలచుకుంటూ ఈ డేట్ ని పదే పదే వల్లెవేసుకుంటూ చంద్రబాబు బాధ పడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: