అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచం మొత్తం ఆసక్తిని కనబరచేవే. ఎందుకంటే అమెరికాతో ప్రపంచానికి అలా సంబంధాలు ముడిపడిపోయాయి. అమెరికా ఒక విధంగా ప్రపంచ దేశాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇదిలా ఉంటే నవంబర్ 3 అంటే ఎంతో దూరం లేదు. ఆ రోజునే అమెరికా ఎన్నికలు. అందువల్ల అమెరికా ఎన్నికలు దాదాపుగా ముంగిటకు వచ్చేసినట్లే. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్ధిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి గెలుస్తాడా అన్నది ఒక చర్చగా ఉంటే ప్రత్యర్ధి డెమోక్రాట్ల అభ్యర్ధి జో బైడెన్ నెగ్గుతారా అన్నది ఆసక్తిని కలిగించే అంశంగా ఉంది.

ట్రంప్ గెలుపు మీద సర్వేలు చూస్తే చివరి నిముషం వరకూ ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి ఉందని అంటున్నారు. బైడెన్ మెల్లగా వచ్చి ఇపుడు అమెరికాలోని అతి కీలకమైన రాష్ట్రాల్లో తన పట్టుని నిలుపుకున్నాడని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ఆయన ట్రంప్ కి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు అని కూడా అంటున్నారు. ఇక ట్రంప్ కి కూడా మరి కొన్ని రాష్ట్రాలో మద్దతు ఉన్నా పెద్ద రాష్ట్రాలు జో బైడెన్ వైపు ఉండడమే ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ట్రంప్ గెలుపు అన్నది చివరి నిముషంలో జరిగే మలుపుల మీద ఆధారపడిఉందని కూడా అంటున్నారు. ఇంకోవైపు జోస్యం చెప్పేవారు కూడా ఎక్కువైపోయారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు, వారి జాతకాలు, పుట్టిన తేదీలు ఇలా ప్రతీ దాన్ని పట్టుకుని మరీ జోస్యం చెబుతున్నారు. ట్రంప్ విషయానికి వస్తే సంఖ్యాశాస్త్రం పరంగా ఆయన బలంగా  ఉన్నారు. కాబట్టి ఆయనకు పరాజయం ఉండదని కొందరు అంటున్నారు మరి కొందరు ట్రంప్ చివరి వరకూ ప్రయత్నించి గెలుపు సాధిస్తారని అంటున్నారు. ఇంకొందరు  అయిత ట్రంప్ జాతకం బాగాలేదని ఆయన ఓటమి ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ట్రంప్ విజేత అవుతారా లేదా అన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: