దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి వైఎస్ జగన్ సర్కార్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారి ఏర్పాటు వల్ల ప్రజలు తమ విలువైన సమయం వృధా కాకుండానే వివిధ రకాల సేవలను ఇంటి దగ్గరే పొందుతున్నారు. ఇటీవలే మొదటి సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న వాలంటీర్లకు సీఎం జగన్ సహా పలువురు నేతలు, ప్రభుత్వ అధికారులు అభినందనలు తెలిపారు. ఇక ప్రస్తుతం శ్రీకాకుళం, నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న 2624 గ్రామ‌/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్ర‌భుత్వ ప‌థకాల‌పై అవ‌గాహ‌న‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://apgv.apcfss.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు.


మొత్తం ఖాళీల వివరాలు: 2624
  • # శ్రీకాకుళం- 451
    # నెల్లూరు-211
    # అనంత‌పురం-981
    # చిత్తూరు-981
ముఖ్య సమాచారం:
  • # అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, స్థానిక గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో నివ‌సిస్తూ ఉండాలి.
  • # ఎంపిక విధానం: ప్ర‌భుత్వ ప‌థకాల‌పై అవ‌గాహ‌న‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • # ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • # ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది:
  • నెల్లూరు-24.10.2020, చిత్తూరు-25.10.2020, శ్రీకాకుళం-22.10.2020, అనంత‌పురం-31.10.2020

  • వెబ్‌సైట్‌:https://apgv.apcfss.in/


మరింత సమాచారం తెలుసుకోండి: