జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నాయకత్వ మార్పు చేసే ఆలోచనలో ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధానంగా బలపడాలి అనుకున్న రాష్ట్రాల్లో కొంతమందికి కీలక పదవులు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. కేంద్ర మంత్రి పదవులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలను కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కొంత మందిని కేంద్రమంత్రి పదవులకు ఎంపిక చేసే విధంగా ప్లాన్ చేస్తుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రులుగా కొంతమందిని తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం  ఇప్పుడు కేంద్ర మంత్రులు గా ఎవరిని తీసుకునే ఆలోచనలో బీజేపీ ఉంది అనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఇప్పుడు బిజెపి మాత్రం కొంతమంది నేతలు కాస్త గట్టిగానే టార్గెట్ చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఒక వైసీపీ ఎంపీకి కేంద్ర మంత్రి పదవి బిజెపి ఆఫర్ చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతున్నాయి.

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా జయదేవ్ కి కూడా కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గల్లా జయదేవ్ గత కొంతకాలంగా బిజెపిలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ ప్లాన్ చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తెలంగాణ నుంచి ధర్మపురి అరవింద్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి రెడీ అయ్యారు. అయితే కొన్ని కారణాలతో ఆయన విషయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా కేంద్ర మంత్రి పదవి కిషన్ రెడ్డి కి ఆఫర్ చేశారట. మరి వీళ్ళు పార్టీ మారతారా లేదా అనేది చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: