ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంతమందిని ఎదుర్కొనే విషయంలో కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది. ప్రధానంగా మంత్రి కొడాలి నాని ని ఎదుర్కొనే విషయంలో తెలుగుదేశం పార్టీ పడుతున్న బాధల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంత్రి కొడాలి నానిని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది నేతలకు మంచి మంచి అవకాశాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొడాలి నాని కి దీటుగా మాట్లాడే నాయకులు మాత్రం తెలుగుదేశం పార్టీలో లేరు అనే చెప్పాలి.

ఎలాగైనా సరే మాట్లాడే సామర్థ్యం ఉన్న నేత కావడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనను ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరికొంత మంది మంత్రులను ఎదుర్కొనే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అవంతి శ్రీనివాస్ ను ఎదుర్కోవడానికి కాస్త ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ని రంగంలోకి దించే విధంగా చంద్రబాబునాయుడు పని చేస్తున్నట్లుగా సమాచారం.

గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీ లోకి వెళ్ళాలి అని భావిస్తే ఆయనను అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు గా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనితో ఆయన టార్గెట్ గా విశాఖ జిల్లాలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా బయట పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట. కృష్ణాజిల్లాలో కొడాలి నాని ను ఎదుర్కోవడానికి విజయవాడకు చెందిన ఒక యువ నేతను రంగంలోకి దించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సదరు యువనేతను ఇప్పుడు బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది ఫలిస్తుందా లేదా అనేది చూడాలి. సదరు యువనేతకు కీలక పదవి కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: