ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇప్పుడు కాస్త మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఫలితం ఏవిధంగా ఉన్నా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం వెనుకబడిన వర్గాలను పార్టీ వైపు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొందరు కీలక వార్నింగ్ ఇస్తున్నారు. ప్రధానంగా ఆయన బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేసే క్రమంలో హిందువులను దగ్గర చేసుకోవడానికి హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను ఎక్కువగా ఖండిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన కొన్ని మతాలను కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా క్రైస్తవుల టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు... వారిని విమర్శించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏపీలో మత మార్పిడులు జరుగుతున్నాయి అని బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని బిజెపి ఏది మాట్లాడుతుందో దాదాపుగా అదే వైఖరితో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. దీనిపై ఇప్పుడు చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబునాయుడు స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదని అంటున్నారు.

కేవలం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం చూసుకొని ఆయన కొంతమంది ని పక్కనపెట్టి తప్పు చేస్తున్నారు అని దీనివలన పార్టీకి బలంగా ఉన్న ఓటు బ్యాంకు దూరమయ్యే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దళితుల్లో ఎక్కువగా క్రైస్తవం వైపు ఉంటారు. వారిని ఈ వ్యాఖ్యల ద్వారా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ముస్లిం మైనారిటీలు కూడా చంద్రబాబు నాయుడు తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు గా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. బీసీ నేతలను ఆహ్వానించే క్రమంలో ఆయన మైనారిటీలకు కాస్త ఇబ్బందికరంగా వాతావరణం సృష్టిస్తున్నారని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే చంద్రబాబు నాయుడు మారతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: