మరోసారి ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉల్లి సామాన్యులు అందరిని కోయకుండానే  కంట నీరు పెట్టించింది. భారీగా పెరిగిన ఉల్లి ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్య ప్రజలు..ఉల్లి  లేకుండానే వంటలు వండుకునే  పరిస్థితి కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ప్రజలందరికీ ఉల్లి కష్టాలు తీర్చేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నాయి . ఇక ఆ తర్వాత ఉల్లి పంట దిగుబడి పెరిగిపోవడంతో.. క్రమక్రమంగా ఉల్లి కష్టాలు తీరిపోయాయి. కానీ ప్రస్తుతం మరోసారి ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు.



 ప్రస్తుతం మార్కెట్ లో ఉల్లి ధర వంద రూపాయలకు పైగానే పలుకుతున్న నేపథ్యంలో ఉల్లి సామాన్య ప్రజలకు భారంగా మారి పోయింది. ఇక ఇప్పటికే సాధారణ కూరగాయల ధరలు కూడా కరోనావైరస్ సంక్షోభం కారణంగా భారీ రేటు పలికుతూ ఉన్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు పెరిగి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలు ఇక ఇప్పుడు ఉల్లి ధరలు కూడా ఆకాశాన్ని ఎగసిపడుతున్న తరుణంలో మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు సబ్సిడీపై ఉల్లిని  ఇవ్వాలని  కోరుకుంటున్నారు ప్రజలు.



 ఇక ఈ క్రమంలోనే ప్రజలందరికీ శుభవార్త తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయి సామాన్య ప్రజలకు ఉల్లి ధరలు భారంగా మారి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలకు ఉల్లి భారంగా మారకుండా ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రంలోని రైతు బజార్లు ప్రధాన నగరాలు పట్టణాలలో ఉల్లి ని సబ్సిడీ కింద అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోల్సేల్ మార్కెట్ లో ఉల్లి కొనుగోలు చేసి... ప్రజలకు ఉల్లిని సబ్సిడీపై తక్కువ ధరకే అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర వంద రూపాయల వరకు పలుకుతుండగా..  రైతు బజార్ లో మాత్రం కేవలం సబ్సిడీపై నలభై రూపాయలకి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: