ప్రస్తుతం ప్రభుత్వాల అలసత్వం కారణం గా ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. పండుగ సీజన్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్  కీ ఈ పండుగ సీజన్లో ఇంటికి వెళ్లాలనుకు నే వారికి ప్రస్తుతం ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసుల పై పండుగ సీజన్లో కూడా ఎలాంటి క్లారిటీ రాకపోవడం తో ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు అందుబాటు లో లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిపోయింది.




 దీంతో ప్రయాణికులు అందరూ ఎంతో ఆందోళన చెందుతూనే ప్రయాణాలు కొనసాగించే  దుస్థితి ఏర్పడింది. అయితే కనీసం ఈ పండుగ సీజన్లో నైనా తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించు కునేందుకు ఒప్పందం కుదురుతుందేమో అని ప్రజలు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసినప్పటికీ అది ఇప్పట్లో జరిగేలా  మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు అందరు పండగ చేసుకుంటు టికెట్ చార్జీలను భారీగా వసూలు చేస్తున్నారు. దాదాపు 350 రూపాయలు ఉన్న టికెట్ చార్జీలను 600 వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.



 దీంతో ఈ పండుగ సీజన్లో ఎంతో మంది ప్రజలకు జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అధిక టికెట్ చార్జీలు వసూలు చేసినప్పటికీ ఇక చేసేదేమీ లేక ఈ పండుగ సీజన్లో జేబులు ఖాళీ అవుతున్నప్పటికీ స్వగ్రామాలకు పయనం అవుతున్నారు ఎంతోమంది ప్రజలు. అయితే వైపు ఆర్టీసీ బస్సులు నడవక.. మరోవైపు రైలు సర్వీసులు కూడా తగినంత అందుబాటులో లేకపోవడంతో ఈ పండుగ సీజన్లో వివిధ ప్రాంతాలకు వెళ్లాలి అనుకున్న ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: