పండుగ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రజలందరినీ ఆకర్షించేందుకు ఎన్నో సంస్థలు ఎన్నో ఆకర్షణీయమైన అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఈ పండుగ సీజన్లో ఓవైపు కస్టమర్ల అందరికీ అండగా నిలవడంతో పాటు తమ మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ఎన్నో వినూత్నమైన ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రకాల బ్యాంకులు ఈ  కామర్స్ దిగ్గజ సంస్థలు షాపింగ్ మాల్స్ కూడా అద్భుతమైన ఆకర్షనీయమైన ఆఫర్లను  ప్రకటించి ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే అన్ని రకాల సంస్థలు అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ప్రస్తుతం నెటిజన్లు అందరి దృష్టి కూడా ఈ కామర్స్ దిగ్గజ సంస్థలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్ డీల్ ప్రకటించిన ఆఫర్ల పై నే ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు ఈ పండుగ సీజన్లో ఎన్నో అద్భుతమైన ఆఫర్లను  ప్రకటించి తన మార్కెట్ను పెంచుకోవడానికి దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లు  ప్రస్తుతం ఎన్నో అద్వితీయమైన ఆఫర్లను కస్టమర్ల ముందు ఉంచిన విషయం తెలిసిందే. దీంతో  రోజురోజుకు ఈ రెండు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ లకు ఆర్డర్ల  ల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఈ పండుగ సీజన్ లో ఉన్న ఆఫర్లను సద్వినియోగం చేసుకొని కస్టమర్లు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కూడా వస్తువులను కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం.



 ఈ క్రమంలోనే ఈ పండుగ సీజన్లో ఆన్లైన్లో ఆఫర్లు అద్భుతంగా ఉండడంతో ఎంతో మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ కు బ్రహ్మరధం పడుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సీజన్లో పండగ సేల్ ప్రారంభమైన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ కామర్స్ దిగ్గజ సంస్థలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లు  రికార్డు స్థాయిలో ఆర్డర్లు అందుకోవడం గమనార్హం. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ కామర్స్ సంస్థలు ఏకంగా 26 వేల కోట్ల విక్రయాలను నమోదు చేయడం గమనార్హం. సెకనుకు 41 ఆర్డర్లు వస్తున్నాయని ఇప్పటివరకు ఏకంగా కోటికి పైగా ఆర్డర్లను డెలివరీ  చేశామని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు లాప్టాప్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట వినియోగదారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: