దసరా శరన్నవరాత్రులు వేడుకలు అన్ని ప్రాంతాల లో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అక్టోబర్ 17 శనివారం బెజవాడ ఇంద్రకీలాద్రి పై మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. అనేక ప్రాంతాల  నుండి భక్తులు, భవానీలు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉన్నారు. రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఐదు రోజులు పూర్తయి పోయాయి. ఈరోజు  దసరా శరన్నవ రాత్రి మహోత్సవాల లో ఆరో రోజు.

లలితా దేవి రూపం ఎలా ఉంటుందంటే...? శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవీ ఇరువైపున ఉంటారు. వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసం తో, వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ, చెరుకు గడను చేతపట్టుకుని శివుని వక్షస్ధలం పై ఉంటుంది.  శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదాశాక్షరీ మహా మంత్రాధి దేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. ఇలా ఈరోజు ఇంద్రకీలాద్రి కానక దుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

ఆన్ లైన్  లో భక్తులు టికెట్స్ కొనుకోవాలని అప్పుడే అనుమతి ఉంటుందని ఆలయ కమిటీ తెలియ జేయడం కూడా మనకి తెలిసిందే. ఇది ఇలా ఉండగా  గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చేసారు. . ప్రస్తుతం దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చేస్తున్నారు. మాస్క్ తప్పని సరి చేశారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలి అని తెలియజేసారు. ఇది ఇలా ఉండగా నిన్న అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించగా ఆ  దుర్గమ్మకు పట్టు వస్త్రాలు  సీఎం జగన్ సమర్పించడం కూడా జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: