తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఎన్ని విధాలుగా కష్టపడుతున్న సరే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో కొంతమంది నుంచి మద్దతు అనేది రావటం లేదు. దీంతో ఇప్పుడు బిజెపి అధిష్టానం కూడా కొంతమంది నేతలు పనితీరు విషయంలో చాలా వరకు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కొంతమంది నేతలు అంటీ ముట్టనట్లు వ్యవహరించడంతో ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉంది. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఒక సీనియర్ నేత అయితే కనీసం బిజెపి ఆఫీసుకు కూడా రావడం లేదని టాక్.

 ఇప్పుడు హైదరాబాదులో భారీ వరదలు ఉన్నా సరే ఆయన మాత్రం ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయటం లేదని బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా ఉం.ది ఇప్పటికే ఆయన నన్ను పిలిచి క్లాస్ కూడా పీకినట్టు గా సమాచారం. అవసరం అయితే త్వరలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఉమ్మడి వరంగల్ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు కూడా ఇప్పుడు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొంతమంది పని చేయక పోవడంతో ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీకి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. దీనితో బండి సంజయ్ ఇప్పుడు చాలావరకు సీరియస్గా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. అయినా సరే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పార్టీ నుంచి కొంత మంది నేతలను సస్పెండ్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న పరిణామాలు మాత్రం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: