ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని  కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అటు ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కరోనా  వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ప్రజలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతునే  ఉంటుంది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మాస్క్  ధరించడం భౌతిక దూరం పాటించడం శానిటైజర్ వాడటం తప్పనిసరిగా మారిన విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన తప్పని సరిగా మాస్కులు వాడాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రజల్లో కూడా అవగాహన పెరిగి పోయి రోజురోజుకు మాస్కులు వాడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. అయితే ప్రస్తుతం రోజురోజుకు మార్కుల వాడకం ఎక్కువ అవుతున్న తరుణంలో మార్కెట్లోకి కూడా ఎన్నో వినూత్నమైన మాస్కులు వస్తూ ఉన్న నేపథ్యంలో... మాస్కు లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కరోనా వైరస్ రక్షణ కోసం తప్పనిసరిగా అందరూ ఎక్కువ సేపు మాస్కులు వాడుతున్న విషయం తెలిసిందే.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కరోనా వైరస్ నుంచి మాస్కులు  రక్షణ కల్పించడం ఏమో కానీ మాస్కులు  ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయని ఇటీవలే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే క్లినికల్, ప్లాస్టిక్ మాస్క్ లతో  ప్రమాదం పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మాస్క్ లను ఎక్కువగా వాడడం ద్వారా ప్రతి ఏటా లక్షల టన్నుల వ్యర్థాలు తయారవుతాయని.. అంతేకాకుండా మాస్కులలో  ఉన్నటువంటి వైరస్ మట్టి నీటిలోకి కలిస్తే మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా ముక్కు నోటి ని కవర్ చేసే గుడ్డ మాస్కులను  వాడటం ఎంతో ఉత్తమం సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: